📢 Advertisement Space

శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరలో ఘన ప్రవచనాలు

🗞️ బిబి న్యూస్ | 01 Apr 2026

అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ మైదానంలో బుధవారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది.మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రామ్‌కి పర్యవేక్షణలో ప్రముఖ ఆధ్యాత్మిక వక్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఘనంగా జరిగాయి . ముందుగా శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత, కమిటీ సభ్యులు వేద మంత్రాలతో ఆశీర్వాదం చేసి సాల్వతో సత్కరించారు.అనంతరం ఎన్టీఆర్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు హాజరై భక్తి పరవశంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చాగంటి కోటేశ్వరరావుని ఘన స్వాగతం పలికి, శాలువా, అమ్మవారి చిత్రపటంతో సత్కరించారు.ప్రవచనాల్లో హిందూ ధర్మం, పురాణాల ప్రాముఖ్యత, సంస్కృతి విలువలు, ధర్మం, భక్తి, కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల పట్ల గౌరవం, సమాజ బాధ్యతలు, అమ్మవారి మహిమల గురించి సరళమైన, హాస్యంతో కూడిన భాషలో వివరించి భక్తులను ఆలోచింపజేశారు.ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని, ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర, శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ ఈఓ శ్రీధర్ మరియు కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.