హోం గార్డు కుటుంబానికి రూ.4,24,120 చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
🗞️ బిబి న్యూస్ | 01 Apr 2026
అనకాపల్లి, ఏప్రిల్ 1: విధులపై నిబద్ధతతో ఉంటూ అనారోగ్యంతో అకాల మరణం చెందిన హోం గార్డు డి.వి.వెంకటరావు కుటుంబాన్ని అనకాపల్లి జిల్లా పోలీసులు అండగా నిలిచారు. విశాఖ ఆర్.ఐ.ఎన్.ఎల్ స్టీల్ ప్లాంట్‌లో డిప్యూటేషన్ విధుల్లో మరణించిన వెంకటరావు కుటుంబానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ బుధవారం తన కార్యాలయంలో రూ.4,24,120 చెక్కుగా అందజేశారు.అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల హోం గార్డులు తమ ఒకరోజు డ్యూటీ అలవెన్స్‌ను స్వచ్ఛంద విరాళంగా ప్రకటించి, ఇతర నిధులతో కలిపి మొత్తం రూ.4,24,120 సమకూర్చారు. ఈ సహృదయ స్పందన కుటుంబాన్ని ఆదుకోవడానికి జరిగింది.హోం గార్డు భార్య దాసరి నీలిమకు చెక్కును అందజేస్తూ ఎస్పీ ఆమెను ఓదార్చారు. "డి.వి.వెంకటరావు మరణం పోలీసు శాఖకు తీరని లోటు. కుటుంబానికి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం.తోటి హోం గార్డుల స్పందన అభినందనీయం.సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాం" అని ఎస్పీ తెలిపారు.ఏ.ఓ సి.హెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, జూనియర్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.