రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎన్టీఆర్ ఆసుపత్రి అధికారులు
🗞️ బిబి న్యూస్ | 26 Sep 2026
అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
అనకాపల్లి, సెప్టెంబర్ 26: రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేలా ప్రజలను చైతన్యపరిచేందుకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా ఆసుపత్రి డీఎంహెచ్‌ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకుని, అవసరమైన వారికి రక్తం అందించేందుకు ముందుకు రావాలని సూచించారు.రక్తదానం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం ఎంతో కీలకమని నిర్వాహకులు తెలిపారు. రక్తదానంపై అపోహలను తొలగించి ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్, ప్రముఖ వైద్యులు డాక్టర్ జగన్ మోహన్, ఎన్టీఆర్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జి డాక్టర్ రమేష్, సర్వేజనా ఐక్యవేదిక వ్యవస్థాపకులు కోరుబిల్లి పరి, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, యువత, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.రక్తదానం ఒక సామాజిక బాధ్యతగా భావించి యువతతో పాటు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.