విశాఖపట్నం: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో చర్చలు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా సోమవారం విశాఖపట్నంలోని బీజేపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రానున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పార్టీ పరిస్థితి, ఎన్నికల సన్నద్ధత, నాయకులు–కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.ఈ సమావేశంలో జిల్లా ధార్మిక సెల్ అధ్యక్షుడు దాడి వీరునాయుడు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావుతో పాటు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.