గణపతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి
🗞️ బిబి న్యూస్ | 19 Sep 2026
కశింకోట: గ్రామంలో నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాల్లో భాగంగా వినాయక కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బీజేపీ ధార్మిక సెల్ అధ్యక్షుడు దాడి వీరునాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ గణపతి ఆరాధనకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. వినాయకుడు తన తల్లిదండ్రులైన పరమశివుడు, పార్వతీదేవి చుట్టూ ప్రదక్షిణలు చేసి తన జ్ఞానం, తెలివితేటలను చాటుకున్న కథను భక్తులకు వివరించారు. ప్రతి శుభకార్యాన్ని గణపతి పూజతో ప్రారంభించడం మన సంప్రదాయమని, వినాయక చవితి పండుగతో అనేక ఉత్సవాలకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు.అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పలకా రవి, బీజేపీ నాయకుడు దాలినాయుడు, బీజేపీ కార్యకర్తలు, వినాయక కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.