📢 Advertisement Space

మూడు టీ20లు... ఒక్క అవకాశం కూడా లేదా? వైభవ్ సూర్యవంశీని ఎందుకు పక్కన పెట్టారు? అభిమానుల్లో తీవ్ర చర్చ!

🗞️ బిబి న్యూస్ | 18 Sep 2026

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో సంచలనంగా ఎదుగుతున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌లలోనూ తుది జట్టులో అవకాశం దక్కకపోవడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేసింది.ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్.. అనంతరం జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటాడు. మూడు మ్యాచ్‌ల్లో 151 పరుగులు చేసి సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.ఇలాంటి ప్రదర్శన తర్వాత అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ.. ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
అసలు కారణం ఏంటి?
కోచ్ గౌతమ్ గంభీర్ వివరణ ప్రకారం.. అబిషేక్ శర్మ–సంజూ శాంసన్ ఓపెనింగ్ జోడీపై జట్టు మేనేజ్‌మెంట్ నమ్మకం కొనసాగించింది. గతంలో జట్టుకు విజయాలు అందించిన ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇవ్వాలని భావించడంతో వైభవ్‌కు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.మరోవైపు, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వంటి వారు సూచించారు. ముఖ్యంగా మూడో టీ20లో అతడిని ఆడించి అంతర్జాతీయ అనుభవం కల్పించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అభిమానుల ప్రశ్న ఒక్కటే!
జట్టులో ఎంపిక చేశారు... కానీ మూడు మ్యాచ్‌ల్లోనూ అవకాశం ఇవ్వలేదు ఎందుకు?
వైభవ్ లాంటి యువ ప్రతిభకు అవకాశం ఎప్పుడు వస్తుంది? అతడిని తుది జట్టులోకి తీసుకునేందుకు జట్టు మేనేజ్‌మెంట్ ఎలాంటి ప్రణాళికతో ఉంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో వినిపిస్తున్నాయి.అయితే వైభవ్‌కు అవకాశాలు పూర్తిగా మూసుకుపోలేదు.అఫ్గానిస్థాన్ సిరీస్ అనంతరం జపాన్‌తో టీ20తో పాటు వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కూడా అతడు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.