📢 Advertisement Space

స్థానిక ఎన్నికల వేళ.. కార్పొరేటర్ టికెట్ల కోసం నేతల ప్రయత్నాలు

🗞️ బిబి న్యూస్ | 14 Sep 2026

బిబి న్యూస్ ప్రత్యేక కథనం:ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీల్లో కార్పొరేటర్ సీట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు ఊపందుకున్నాయి.తమకు టికెట్ దక్కేలా పార్టీ పెద్దలను కలుస్తూ,తమ బలాబలాలను వివరిస్తూ పలువురు నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.యువత రాజకీయాల్లోకి రావడం ఎంత ముఖ్యమో, రాజకీయ అనుభవం కూడా అంతే అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ ఆశించడమే కాకుండా,గతంలో ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ, నమ్మకం, పార్టీ కోసం చేసిన సేవ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.అదేవిధంగా ప్రజాజీవితంలో అనుభవంతో పాటు బాధ్యతలు నిర్వహించే స్థాయి,రాజకీయ పరిణతి కూడా కీలకమని వారు పేర్కొంటున్నారు.పార్టీల కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన నాయకులు తమ వంతు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని,ఆర్థికంగా స్థిరపడిన వారు,కుటుంబ నేపథ్యం ఉన్నవారు కూడా టికెట్ల కోసం పోటీ పడుతున్నారని పలువురు నాయకులు అంటున్నారు.అయితే ఆశావహులు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ సీటు ఇవ్వడం సాధ్యం కాదని,పార్టీ అధిష్టానం గెలుపు అవకాశాలు, ప్రజాదరణ, పార్టీ విధేయత తదితర అంశాలను పరిశీలించి కొందరికే అవకాశం కల్పించగలదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అవకాశం వచ్చే వరకు ఓపికగా పార్టీ కోసం పనిచేస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని సీనియర్ నాయకులు సూచిస్తున్నారు.