📢 Advertisement Space

అనకాపల్లి కోర్టులో పనిచేయని లిఫ్ట్.. వృద్ధులకు తప్పని ఇబ్బందులు

🗞️ బిబి న్యూస్ | 10 Sep 2026

అనకాపల్లి: జిల్లా కేంద్రంగా అనకాపల్లి అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక వసతుల సమస్యలు మాత్రం పూర్తిగా పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ న్యాయం అందించే అనకాపల్లి కోర్టులో లిఫ్ట్‌ చాలా రోజులుగా పనిచేయకపోవడంతో కోర్టుకు వచ్చే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కోర్టు భవనంలోని పై అంతస్తులకు వెళ్లేందుకు మెట్లు ఎక్కాల్సి రావడంతో వృద్ధులు, నడవడానికి ఇబ్బంది పడుతున్న వారు అవస్థలు పడుతున్నారు. అత్యవసర పనుల నిమిత్తం కోర్టుకు వచ్చే ప్రజలకు లిఫ్ట్ అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.జిల్లా కేంద్రంలోని కోర్టులో ఇలాంటి పరిస్థితి ఉండటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లిఫ్ట్‌ను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.