📢 Advertisement Space

కొణతాల కరుణించి, రాంకీ రమ్మంటే ఎన్నికల బరిలోకి : మళ్ళ శ్రీను

🗞️ బిబి న్యూస్ | 09 Sep 2026

అనకాపల్లి: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనకాపల్లి రాజకీయాల్లో ఆశావహుల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో జనసేన సీనియర్ నాయకుడు మళ్ళ శ్రీను కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.నూకాంబిక అమ్మవారి దేవస్థానం సమీపంలోని వి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మళ్ళ శ్రీను మాట్లాడారు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.స్థానిక సంస్థల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీ కోసం కష్టపడుతున్న వారికి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జనసేన అనకాపల్లి ఇన్‌చార్జి బీమరశెట్టి రాంకీ సూచనలు, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తాను ముందుకు సాగుతానని పేర్కొన్నారు.కుటుంబ సభ్యులు, యువత, అభిమానుల నుంచి తనకు మంచి మద్దతు ఉందని, పార్టీ అవకాశం కల్పిస్తే ప్రజల ఆశీస్సులతో విజయం సాధించేందుకు కృషి చేస్తానని మళ్ళ శ్రీను ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో చిరంజీవి అభిమానులు శ్రీరామ్ దాస్ గోవింద్, గల్లా కొండలరావుతో పాటు పలువురు చిరంజీవి అభిమానులు, జనసేన కార్యకర్తలు, మళ్ళ శ్రీను అభిమానులు పాల్గొన్నారు.