పెందుర్తి: అనకాపల్లి జిల్లా బీజేపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని పెందుర్తిలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఇచ్చిన ఆదేశాల మేరకు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ, రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో అనకాపల్లి జిల్లాలో బీజేపీని మరింత బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఎలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిళ్లా రమాకుమారి, అనకాపల్లి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పలకా రవి, జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ దాడి వీరునాయుడుతో పాటు జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.