📢 Advertisement Space

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర కల సాకారం: మళ్ళ సురేంద్ర

🗞️ బిబి న్యూస్ | 03 Sep 2026

అనకాపల్లి: పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలను అందించాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారని ఆంధ్రప్రదేశ్ గవర కార్పొరేషన్ చైర్మన్, భీమిలి నియోజకవర్గ పరిశీలకులు మళ్ళా సురేంద్ర అన్నారు.పాయకరావుపేటలో జరిగిన కార్యక్రమంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా సుమారు 213 కిలోమీటర్ల మేర కాలువ పనులు పూర్తి చేసి, దాదాపు 30 టీఎంసీల గోదావరి జలాలను విశాఖపట్నం వరకు తీసుకురావడానికి చేపట్టిన చర్యలను ఆయన ప్రశంసించారు. ఈ నీటితో అనకాపల్లి మీదుగా విశాఖపట్నం ప్రాంతానికి తాగునీరు, సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు నీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.పాయకరావుపేట వద్ద గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హారతి ఇవ్వడం ఉత్తరాంధ్ర ప్రజలకు ఆనందాన్ని కలిగించిందన్నారు.ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మళ్ళ సురేంద్ర పేర్కొన్నారు.ప్రజల ప్రయోజనాలను గుర్తించి వారికి ఆనందం కలిగించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వానికి ఉండాలని ఆకాంక్షించారు.