📢 Advertisement Space

కె.ఎం. నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి

🗞️ బిబి న్యూస్ | 02 Sep 2026

అనకాపల్లి: దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని అనకాపల్లి జీవీఎంసీ 80వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కె.ఎం. నాయుడు ఆధ్వర్యంలో గవరపాలెం విజ్ఞాన సమితి జంక్షన్ వద్ద ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ, గౌరీ పీఏసీఎస్ మాజీ చైర్మన్ విల్లూరి శివసూరి హాజరై వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం “జోహార్ వైఎస్సార్” అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలకు వైఎస్సార్ ప్రాణం పోశారని పేర్కొన్నారు.అనంతరం కె.ఎం. నాయుడు, కర్రి రుద్రినాయుడు సోదరుల ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.