ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎంపీ సీఎం రమేష్
🗞️ బిబి న్యూస్ | 01 Sep 2026
అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో నేడు నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పీలా గోవింద్ గారితో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు.సమాజంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవనోపాధికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.అనంతరం అనకాపల్లి ఎంపీగా రెండేళ్ల ప్రజా ప్రగతి ప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు.ఎంపీగా రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసేలా ఈ బుక్‌లెట్‌ను రూపొందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.