📢 Advertisement Space

కశింకోట RECS పాలిటెక్నిక్ కళాశాల టీచర్ల రిలే నిరాహార దీక్షకు కాండ్రేగుల చందు మద్దతు

🗞️ బిబి న్యూస్ | 31 Aug 2026

కశింకోట: కశింకోట RECS పాలిటెక్నిక్ కళాశాల టీచర్లు తమ పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాండ్రేగుల చందు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా కాండ్రేగుల చందు మాట్లాడుతూ.. కశింకోట RECS పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న టీచర్లు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్న ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.ఎలాగైనా టీచర్లకు రావాల్సిన జీతాలను ప్రభుత్వం ఇప్పించి, వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీచర్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారి పోరాటానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని కాండ్రేగుల చందు స్పష్టం చేశారు.RECS పాలిటెక్నిక్ కళాశాల టీచర్ల సమస్యపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ జీతాలను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.