అనకాపల్లి: పాయకరావుపేటలో సెప్టెంబర్ 2న జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీల నాయకుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమ విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, సమన్వయంపై నేతలు చర్చించారు.సమావేశంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, టీడీపీ ఇన్‌చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్లా సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీతో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.