అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో బీజేపీ పార్టీ జోరందుకుంది. పార్టీ బలోపేతంలో భాగంగా బీజేపీలోకి వరుసగా చేరికలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా పట్టణ బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ దాడి వీరునాయుడు ఆధ్వర్యంలో కాండ్రేగుల శ్రీనివాసరావు బీజేపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావుతో పాటు జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.