📢 Advertisement Space

మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఘనంగా ఉచిత వైద్య శిబిరం

🗞️ బిబి న్యూస్ | 26 Aug 2026

అనకాపల్లి: మదర్ థెరిసా జయంతిని పురస్కరించుకుని అనకాపల్లి గవరపాలెం సంతబైలు సమీపంలో సర్వేజనా ఐక్యవేదిక కోరిబిల్లి పరి ఆధ్వర్యంలో మాధవ్ బాగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, వైజాగ్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మదర్ థెరిసా చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించి, ఆమె చేసిన నిస్వార్థ మానవతా సేవలను స్మరించుకున్నారు.అనాథలు, నిరుపేదలు, రోగులు, సమాజంలోని అణగారిన వర్గాల కోసం మదర్ థెరిసా చేసిన సేవలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలు లభించాయని తెలిపారు.వైద్య శిబిరంలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా ఈసీజీ పరీక్షలు చేశారు. మదర్ థెరిసా స్ఫూర్తితో ఎంతోమంది యువత సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా డాక్టర్ రాకేష్, మాధవ్ బాగ్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ సుష్మా, ప్రముఖ సంఘ సేవకులు,ఎస్ డి గ్రూప్స్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్,కర్రీ కొండబాబు, ప్రసన్న, రాము, శివ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.