సాదిక్ ఖాన్‌పై సమగ్ర విచారణకు జిల్లా కలెక్టర్‌కు వినతి
🗞️ బిబి న్యూస్ | 24 Aug 2026
అనకాపల్లి: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, ఇందుకు కారణమైన సాదిక్ ఖాన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. జనతా వారధి కన్వీనర్ గొర్లె రామునాయుడు, కో-కన్వీనర్ ఈశ్వర ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ గండేపల్లి శేషు పరదేశినాయుడు, ధార్మిక సెల్ కన్వీనర్ దాడి వీరునాయుడు, అలమండ శ్రీను, వేపగుంట మండల అధ్యక్షులు నేబర్తి వెంకటరమణ, ఆంజనేయమూర్తి, రాపేటి సంతోష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.