దాడి వీరునాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డా.బి.ఎం. నాయుడు
🗞️ బిబి న్యూస్ | 21 Aug 2026
అనకాపల్లి, ఆగస్టు 21: భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ దాడి వీరునాయుడు జన్మదినం సందర్భంగా రాధాకృష్ణ దేవస్థాన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, రిటైర్డ్ బ్రిటిష్ మెడికల్ ప్రొఫెసర్ (లండన్) డా. బి.ఎం. నాయుడు ఆయనను ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డా. బి.ఎం. నాయుడు మాట్లాడుతూ.. దాడి వీరునాయుడు సౌమ్య స్వభావంతో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా గుర్తింపు పొందారని అన్నారు. ప్రజా సేవతో పాటు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆయన చూపుతున్న ఆసక్తి అభినందనీయమని పేర్కొన్నారు.దేవాలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో దాడి వీరునాయుడు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్‌గా ఆయనకు బాధ్యతలు అప్పగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతంతో పాటు ధర్మ పరిరక్షణ, సమాజ సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా దాడి వీరునాయుడు మాట్లాడుతూ.. డా. బి.ఎం. నాయుడు తనపై చూపుతున్న ఆప్యాయత, ప్రోత్సాహం, ఆశీస్సులు తనకు ఎంతో విలువైనవని అన్నారు. పెద్దల మార్గదర్శకత్వం తన సేవా కార్యక్రమాలకు మరింత ప్రేరణనిస్తుందని తెలిపారు.తనపై నమ్మకంతో బీజేపీ జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ధర్మ పరిరక్షణ, దేవాలయ సేవ, ప్రజా సేవలో తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.