📢 Advertisement Space

బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం: మళ్ళ సురేంద్ర

🗞️ బిబి న్యూస్ | 19 Aug 2026

అనకాపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల పునరుద్ధరణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లి పట్టణంలోని తన స్వగృహంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు.పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ తదితర స్థానిక సంస్థల్లో 34%, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో 33.18% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం బీసీలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 24%కి తగ్గించి వేలాది రాజకీయ అవకాశాలను దూరం చేసిందని విమర్శించారు.బీసీలకు రాజకీయ ప్రాధాన్యత పెంచిన ఘనత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు దక్కుతుందని మళ్ళా సురేంద్ర పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు దాడి జగన్, బుద్ధ శ్రీనివాసరావు, కాండ్రేగుల రాజు తదితరులు పాల్గొన్నారు.