548 మందికి ఉచిత వస్తి కర్మ చికిత్స.. ఆయుర్వేద రంగంలో ప్రపంచ రికార్డు
🗞️ బిబి న్యూస్ | 18 Aug 2026
అనకాపల్లి,ఆగస్టు 18: ఆయుర్వేద రంగంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చరక జయంతి ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆగస్టు 16 నుంచి 18 వరకు నిర్వహించిన మెగా ఆయుర్వేద వైద్య శిబిరంలో 548 మంది రోగులకు ఉచితంగా వస్తి కర్మ చికిత్స అందించారు.వస్తి కర్మతో పాటు విద్ధ కర్మ, అగ్ని కర్మ వంటి ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలను కూడా రోగులకు అందించారు. ఇంత భారీ సంఖ్యలో రోగులకు ఉచితంగా వస్తి కర్మ చికిత్స అందించడం ఆయుర్వేద రంగంలో విశిష్ట ఘట్టంగా నిలిచింది.ఈ ఘనతను ది బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది. సంస్థ భారతదేశ ముఖ్య అడ్జుడికేటర్ యతీష్ శుక్లా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్వహణ తీరును ప్రశంసించారు. అనంతరం ప్రపంచ రికార్డు సర్టిఫికెట్, ట్రోఫీ, మెడల్‌ను ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, వరము చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వ ఆయుర్వేద పరిషత్ అనుసంధాన ప్రకోష్ట్ ప్రభారి డా. టి. సుందర రాజ్ పెరుమాల్‌కు అందజేశారు.ఈ మెగా వస్తి కర్మ శిబిరానికి ‘సౌత్ ఇండియన్ చరక’గా పేరొందిన డా. ఎన్. ఆంజనేయ మూర్తి వ్యక్తిగతంగా మార్గదర్శకత్వం వహించారు. ఆయన అనుభవం, సూచనలు, పర్యవేక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాయి.ఈ కార్యక్రమం విజయవంతానికి విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు డా. సత్యనారాయణ, ఉత్తరాంధ్ర విభాగం అధ్యక్షులు డా. ఈశ్వరరావు, ఉత్తరాంధ్ర విభాగం ప్రధాన కార్యదర్శి డా. దుర్గేష్ కుమార్, డా. కవిత సుందర రాజ్, డా. సుశీల మూర్తి, డా. దివ్య భారతి, డా. గాయత్రి దేవి, డా. కమలాకర్ తదితర వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, నిర్వాహకులు విశేష కృషి చేశారు.ఈ ప్రపంచ రికార్డు కేవలం ఒక అవార్డు మాత్రమే కాదని, ఆచార్య చరకుని మహోన్నత వారసత్వానికి, ఆయుర్వేద వైద్యుల సేవాభావానికి, భారతీయ వైద్య విధానం పట్ల అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, సేవాభిమానుల సమిష్టి కృషికి లభించిన గౌరవమని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన విశాఖపట్నం, అనకాపల్లి పరిసర ప్రాంతాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.