📢 Advertisement Space

పీలా గోవింద సత్యనారాయణ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మళ్ళ సురేంద్ర

🗞️ బిబి న్యూస్ | 18 Aug 2026

అనకాపల్లి: గవరపాలెం శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయం వద్ద టీడీపీ కార్యాలయంలో అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, ఏపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ దర్శకుడు నక్కిన త్రినాథరావు, ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్రతో పాటు కూటమి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పీలా గోవింద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2014–2019 మధ్య ఎమ్మెల్యేగా పీలా గోవింద్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలందిస్తున్నారని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇంచార్జ్‌లు బోడెడ జోగి నాయుడు, పోలవరపు త్రినాథ్, బొద్దపు ప్రసాద్, మాదంశెట్టి నీలబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొణతాల రత్నకుమారి, బీజేపీ సీనియర్ నాయకులు కొణతాల అప్పలరాజు, జనసేన నాయకులు, గవర కార్పొరేషన్ డైరెక్టర్లు, దేవస్థానాల చైర్మన్లు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.