📢 Advertisement Space

బొడ్డేడ జోగి నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మళ్ళ సురేంద్ర

🗞️ బిబి న్యూస్ | 17 Aug 2026

అనకాపల్లి, ఆగస్టు 17: అనకాపల్లి పట్టణం గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ శ్రీనివాస కల్యాణ మండపంలో 80వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ బొడ్డేడ జోగి నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర హాజరై జోగి నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని, భవిష్యత్‌లో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.