📢 Advertisement Space

81వ డివిజన్ సమస్యలపై కమిషనర్‌కు వినతి

🗞️ బిబి న్యూస్ | 17 Aug 2026

అనకాపల్లి, ఆగస్టు 17: జీవీఎంసీ పబ్లిక్ గ్రీవెన్స్‌లో భాగంగా అనకాపల్లి 81వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మళ్లా సురేంద్ర జీవీఎంసీ ప్రధాన కమిషనర్ కేతన్ గార్గ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా 81వ డివిజన్‌లో మూతపడిన వాటర్ ట్యాంకులు, అభివృద్ధి పనులు, వీధి దీపాల సమస్యలపై కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే తెలుగు యువత నాయకుడు భానుచంద్ర ద్వారా ఏఎంసీ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇంటి పన్ను, ఇళ్ల పట్టాల సమస్యలను కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కేతన్ గార్గ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ చక్రవర్తి, 83వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ బొద్దపు ప్రసాద్, పొలిమేర ఆనంద్, బొమ్మల దేవి తదితరులు పాల్గొన్నారు.