బీబీ న్యూస్ ఆధ్వర్యంలో ‘కొత్త జంట’ నూతన కార్యక్రమం
🗞️ బిబి న్యూస్ | 17 Aug 2026
ఉచితంగా పెళ్లిచూపుల వేదిక..మంచి సంబంధాలను చేరువ చేసే ప్రయత్నం
అనకాపల్లి, ఆగస్టు 17: ప్రస్తుత పరిస్థితుల్లో వివాహ సంబంధాల కోసం కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బీబీ న్యూస్ యాజమాన్యం నూతనంగా ‘కొత్త జంట’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా వివాహానికి సంబంధించి మంచి కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, మంచి ఉద్యోగం కలిగిన యువతీ యువకుల వివరాలను ఉచితంగా ప్రచారం చేసి, వారికి తగిన మంచి సంబంధాలను చేరువ చేయాలని బీబీ న్యూస్ నిర్ణయించింది.బీబీ న్యూస్ పోర్టల్ ద్వారా ‘కొత్త జంట’ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఒక ఉచిత వేదికను అందించనుంది. ఎటువంటి ప్రచార రుసుము లేకుండా అబ్బాయి లేదా అమ్మాయి ప్రొఫైల్‌ను ప్రచురించే అవకాశం కల్పిస్తోంది.మీరు చేయాల్సిందొక్కటే: మీ అబ్బాయి లేదా అమ్మాయి పూర్తి ప్రొఫైల్‌తో పాటు ఫోటోను బీబీ న్యూస్ వాట్సాప్ నంబర్ 7382208111కు పంపించాలి. అందిన వివరాలను పరిశీలించి, బీబీ న్యూస్ ద్వారా ఉచితంగా ప్రచురించి, తగిన వివాహ సంబంధాలు చేరువయ్యేలా సహకారం అందించనుంది.వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు మంచి సంబంధాలను వెతుక్కోవాలని బీబీ న్యూస్ యాజమాన్యం కోరింది.
‘కొత్త జంట’ — మంచి సంబంధాలకు బీబీ న్యూస్ వేదిక.