📢 Advertisement Space

అనకాపల్లిలో ఘనంగా అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి వేడుకలు

🗞️ బిబి న్యూస్ | 16 Aug 2026

అనకాపల్లి, ఆగస్టు 16: భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతిని పురస్కరించుకుని అనకాపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రముఖ రచయిత టీజీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో తొలుత బైపాస్ రోడ్డులోని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బెల్లం మార్కెట్ సమీపంలోని రింగ్‌రోడ్డులో ఉన్న అటల్‌జీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, పేదలకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ దేశం పట్ల వాజ్‌పేయి చూపిన అంకితభావం, దూరదృష్టి, సుపరిపాలన, దేశ రక్షణకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలు, ఆదర్శాల బాటలో నడవడమే అటల్‌జీకి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు డి. ఈశ్వరప్రసాద్, అనకాపల్లి జిల్లా బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ దాడి వీరునాయుడు, జిల్లా కోశాధికారి ఎం.ఎం. నాయుడు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఓరుగంటి నాగమణి, మండల అధ్యక్షులు కొమ్మనాపల్లి సన్యాసిరావు, వి. నర్సింగ యాదవ్, మండల ఉపాధ్యక్షులు పొలిమేర మోహన్‌రావు, కొనతాల పరమేశ్వరి, పెంటకోట తులసి, ఆలేఖ్య తదితర బీజేపీ నాయకులు, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.