అనకాపల్లి: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లిలోని వీల్స్ ఆఫ్ ఫైర్ స్కేటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో స్కేటింగ్ ర్యాలీ నిర్వహించారు. స్కేటింగ్ గ్రౌండ్ నుంచి అనకాపల్లి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ సాగింది.అనంతరం స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి స్కేటింగ్ క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించి, వారిని అభినందించారు.