📢 Advertisement Space

శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

🗞️ బిబి న్యూస్ | 15 Aug 2026

కశింకోట:80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కశింకోటలోని శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ డి.డి. నాయుడు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజూ తల్లిదండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయులను గౌరవించాలని సూచించారు. చదువుతో పాటు ప్రతిరోజూ ఆటలు ఆడాలని, చక్కగా చదువుకోవాలని, సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు సుమతీ శతకం, వేమన శతకం, భగవద్గీత వంటి గ్రంథాలను చదివి మంచి విలువలు, సంస్కారం అలవర్చుకోవాలని సూచించారు.అనంతరం పాఠశాల కరస్పాండెంట్ మళ్ల జగదీష్, ప్రిన్సిపల్ మళ్ల శైలజలను డాక్టర్ డి.డి. నాయుడు అభినందించారు. విద్యార్థులకు క్రమశిక్షణను అలవర్చడంతో పాటు, నాణ్యమైన విద్య అందించేలా మంచి ఉపాధ్యాయులతో శిక్షణా తరగతులు నిర్వహిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు మంచి బాట వేస్తున్నారని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.