📢 Advertisement Space

అనకాపల్లి సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు

🗞️ బిబి న్యూస్ | 13 Aug 2026

అనకాపల్లి, ఆగస్టు 13: “అనకాపల్లి” సినిమా టాలీవుడ్ హైదరాబాద్ ఫిలిం చాంబర్‌లో మంచి స్పందన, ప్రశంసలు అందుకుంది. ఈ సానుకూల స్పందనతో చిత్రబృందం మరికొద్ది రోజుల్లో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.ఫిలిం చాంబర్ పెద్దల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న చిత్రబృందం తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో “అనకాపల్లి” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా చిత్రబృందం ముందుకు సాగుతోంది. “అనకాపల్లి” అనే పేరు ఈ సినిమాతో దేశవ్యాప్తంగా మారుమోగాలని తమ ఆకాంక్ష అని పేర్కొంది.తమపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరూ మరికొంత ఓపిక, సహనం, సహృదయంతో తమను అర్థం చేసుకుని, ఇప్పటివరకు అందించిన ప్రేమాభిమానాలు, సహకారాన్ని కొనసాగించాలని చిత్రబృందం కోరింది.శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులతో “అనకాపల్లి” సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోందని తెలిపింది.“అనకాపల్లి అంటే ఒక ఊరు కాదు… ఒక బ్రాండ్. సినిమా లేటుగా వచ్చినా… లేటెస్ట్‌గా రాబోతోంది” అంటూ చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఎడిటర్: కాండ్రేగుల బోస్