భీమిలి, జూలై 31: భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం, అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయడంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, మండపల్లి రామప్రసాద్, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు పులపర్తి నాని, భాష్యం ప్రవీణ్, భీమిలి నియోజకవర్గ పరిశీలకులు మళ్లా సురేంద్ర, చిక్కాల విజయ్, ఆర్డీఓ సందీప్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.