అచ్చుతాపురంలో ఘనంగా వైఎస్సార్సీపీ ఇంచార్జి కరణం ధర్మశ్రీ జన్మదిన వేడుకలు
🗞️ బిబి న్యూస్ | 31 Jul 2026
అచ్చుతాపురం, జూలై 31: వైఎస్సార్సీపీ ఎల్లమంచిలి నియోజకవర్గ ఇంచార్జి కరణం ధర్మశ్రీ జన్మదిన వేడుకలను అచ్చుతాపురం మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ఇంచార్జి దేశంశెట్టి శంకరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కరణం ధర్మశ్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, ఆయన ప్రజాసేవా దృక్పథం,పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషిని కొనియాడారు. భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అచ్చుతాపురం ఎంపీపీ కోన సంధ్య–బుజ్జి, జడ్పీటీసీ సభ్యులు నర్మాల కుమార్, లాలం రాము, పార్టీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు అభిమానులు పాల్గొని కరణం ధర్మశ్రీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.