📢 Advertisement Space

అనకాపల్లి: ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌కు విశేష స్పందన

🗞️ బిబి న్యూస్ | 26 Jul 2026

అనకాపల్లి 80వ వార్డు పరిధిలోని రాజుపాలెం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. డా. దండా సిద్ధార్థ చారిటబుల్ ట్రస్ట్, సంజీవని జనరల్ & పోలీ క్లినిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని 80వ వార్డు ఇన్‌చార్జ్ కేఎం నాయుడు ప్రారంభించారు.డా. సిద్ధార్థ్ నేతృత్వంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. సుదర్శన్ రెడ్డి సుమారు 120 మందికి ఈసీజీ, 2డీ ఈకో వంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.గ్రామ ప్రజలు ఈ సేవలను అభినందిస్తూ, ఇటువంటి వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహించాలని కోరారు.