📢 Advertisement Space

నీట్/సీబీఎస్‌ఈ పరీక్షల అవకతవకలపై కాంగ్రెస్ కొవ్వొత్తుల నిరసన

🗞️ బిబి న్యూస్ | 26 Jul 2026

అనకాపల్లి, జూలై 26: నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, అలాగే విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులను నిరసిస్తూ అనకాపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ నాయకులు ఆదివారం గాంధీనగర్ ప్రధాన రహదారిలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, విద్యార్థులపై బలప్రయోగాన్ని ఖండిస్తూ బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తుట్టా రమణ, అనకాపల్లి అసెంబ్లీ ఓబీసీ చైర్మన్ బుద్ధ మహేష్, జిల్లా కార్యదర్శి జి. గున్న బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కాపారపు సత్యనారాయణ, మండల అధ్యక్షులు కె. నూక అప్పారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సేనాపతి రాజు, బోయిన భానుమూర్తి యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకుడు నవీన్ తదితరులు పాల్గొన్నారు.