నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ
🗞️ బిబి న్యూస్ | 25 Jul 2026
అనకాపల్లి, జూలై 25: నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా బొడ్డు శ్రీనివాసరావు మాట్లాడుతూ, నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి అసెంబ్లీ కన్వీనర్ మల్లపురెడ్డి కోటేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాపారపు సత్యనారాయణ, పీసీసీ సభ్యుడు టి. రమణ, రాజు, సీనియర్ నాయకులు దత్తు, కశింకోట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సనెడ గజ్జాల, బుద్ధ మహేష్, భానుమూర్తి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాహుల్, తుమ్మపాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నూక అప్పారావు తదితరులు పాల్గొన్నారు.ఇంగ్లీష్ పేపర్ పోస్టర్ కావాలి