జాతీయ నాయకుడు కొత్తూరి వెంకట సుబ్బారావుకు ఘన సన్మానం
🗞️ బిబి న్యూస్ | 24 Jul 2026
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం
అనకాపల్లి, జూలై 25: నేషనల్ స్పైసెస్ బోర్డ్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సిద్ధాంతాలతో పాటు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి విశేష సేవలందిస్తున్న జాతీయ నాయకుడు కొత్తూరి వెంకట సుబ్బారావుకు అనకాపల్లిలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని కొత్తూరి వెంకట సుబ్బారావును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకుడిగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించిన కొత్తూరి వెంకట సుబ్బారావు పార్టీ సిద్ధాంతాల ప్రచారం, సనాతన ధర్మ పరిరక్షణ, గ్రామీణ స్థాయిలో కార్యకర్తల సమన్వయం, పార్టీ జెండాలు, కండువాలు, ప్రచార సామగ్రిని తక్కువ ధరలకు అందుబాటులో ఉంచడం వంటి సేవల ద్వారా విశేష గుర్తింపు పొందారని కొనియాడారు.అనంతరం నిర్వహించిన పరిచయ సమావేశంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పరస్పరం పరిచయం చేసుకొని, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు, సీనియర్ నాయకుడు దాడి వీరునాయుడు, భట్ట సాయిరాం ప్రసాద్, అల్లేశ్వరి రావు, కాళేశ్వరరావు, అప్పారావు, శ్రీరంగం రమేష్, కోరిగంటి కామేశ్వరరావు, నితిన్, బి. భానుమతి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.