📢 Advertisement Space

దేశ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను సహించం: ద్వారపురెడ్డి పరమేశ్వరరావు

🗞️ బిబి న్యూస్ | 22 Jul 2026

అనకాపల్లి: దేశ భద్రత, సార్వభౌమాధికారం మరియు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లిలో గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో దేశ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో విదేశీ శక్తులతో కుమ్మక్కై కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మార్గదర్శకత్వంలో, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మోదీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ, దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడానికి లేదా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కించపరిచేందుకు చేసే ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ సహించరని అన్నారు. విదేశీ శక్తులతో కుమ్మక్కై దేశంలో అస్థిరత సృష్టించే కుట్రలను బీజేపీ గట్టిగా తిప్పికొడుతుందని పేర్కొన్నారు.మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుండటాన్ని తట్టుకోలేక కొందరు దేశ వ్యతిరేక ప్రచారాలకు పాల్పడుతున్నారని నాయకులు ఆరోపించారు.దేశ రక్షణ, జాతీయ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి హరి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు దాడి వీరునాయుడు, రవిరాజ్, భట్ట సాయిరాం, ప్రసాద్, అల్లేశ్వరి రావు, కాళేశ్వరరావు, అప్పారావు, బొడ్డేడ భాస్కర్, శ్రీరంగం రమేష్, కోరిగంటి నాగమణి, కామేశ్వరరావు, నితిన్, బి. భానుమతి, మణికంఠ, అలమండ శ్రీను, బొడ్డేడ శేషగిరి, అయ్యప్ప గుప్తతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మోదీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.