నారాయణ స్కూల్‌లో క్యాబినెట్ ఎన్నికల అనంతరం ఇన్వెస్టిచర్ సెరిమనీ ఘనంగా నిర్వహణ
🗞️ బిబి న్యూస్ | 21 Jul 2026
అనకాపల్లి: స్థానిక నారాయణ స్కూల్‌లో విద్యార్థి నాయకత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన క్యాబినెట్ ఎన్నికల అనంతరం ఇన్వెస్టిచర్ సెరిమనీ (Investiture Ceremony) ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ. శ్రీనివాస్ గారు, ఎస్‌ఐ ఏ. వెంకటేశ్వరరావు గారు హాజరై, విద్యార్థి నాయకులుగా ఎన్నికైన వారికి బ్యాడ్జీలు, శాష్‌లు (Sashes) ధరింపజేసి అభినందించారు.ఈ సందర్భంగా డీఎస్పీ ఈ. శ్రీనివాస్ మాట్లాడుతూ, "నేటి విద్యార్థులే రేపటి నాయకులు. నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలి. క్రమశిక్షణ, బాధ్యత, సేవాభావంతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు" అని విద్యార్థులను ప్రోత్సహించారు.ఎస్‌ఐ ఏ. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. విద్యతో పాటు విలువలు, బాధ్యతలను కూడా విద్యార్థులకు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్స్ ఏజీఎం శివరామ్ గారు, ఆర్‌ఐ రవికుమార్ గారు, ప్రిన్సిపల్స్ కె. రాజ గారు, జి. శ్రీనివాసరావు గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.