సప్త ఋషి వేద పాఠశాలను సందర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు
🗞️ బిబి న్యూస్ | 21 Jul 2026
అనకాపల్లి: సబ్బవరం మండలం గొల్లలపాలెం లో గల సప్త ఋషి వేద పాఠశాల ఆహ్వానం మేరకు అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభ్యాసం, వారి బాగోగులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.ఇటువంటి వేద పాఠశాలలు సమాజంలో ఉండటం ఎంతో అవసరమని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, దాడి వీరునాయుడు, కర్రి రామకృష్ణ, ఈశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.