నూతన విగ్రహాలకు రంగులు వేస్తున్న పనులను పరిశీలించిన డా. బి.యం. నాయుడు (లండన్)
🗞️ బిబి న్యూస్ | 20 Jul 2026
అనకాపల్లి: కొండకొప్పాక గ్రామంలోని శ్రీ రాధా కృష్ణ దేవస్థానం శాశ్వత గౌరవ అధ్యక్షులు డా. బి.యం. నాయుడు (లండన్) తన కుటుంబ సభ్యులతో కలిసి దేవస్థానాన్ని సందర్శించారు. దేవస్థానంలో నూతనంగా ప్రతిష్ఠించనున్న విగ్రహాలకు కళాకారులు రంగులు వేస్తున్న పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా దేవస్థాన వ్యవస్థాపక అధ్యక్షులు వీరునాయుడుతో కలిసి ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా వ్యాసపీఠం, సతీ సమేత వేదపురుషుల విగ్రహాలు, పద్మనాభస్వామి దర్శన దృశ్యం, క్షీరసాగర మథనం, గోపికలతో శ్రీకృష్ణుడు, శంఖు-నామాల శిల్పాలు అత్యంత అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు.ముఖ్యంగా సతీ సమేత వేదపురుషుల విగ్రహాలను ఒకే దేవస్థానంలో ప్రతిష్ఠించడం భారతదేశంలోనే ఇదే తొలిసారి అని నిర్వాహకులు పేర్కొన్నారు.వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి నాటికి ఈ అద్భుత శిల్పాలు, విగ్రహాలను భక్తుల దర్శనార్థం అందుబాటులోకి తీసుకురావడానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయని దేవస్థాన నిర్వాహకులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని డా. బి.యం. నాయుడు పేర్కొన్నారు.