📢 Advertisement Space

10వ తరగతిలో 590 మార్కులు సాధించిన పెంటకోట రిషీకేష్‌కు ప్రతిష్ఠాత్మక 'షైనింగ్ స్టార్' అవార్డు

🗞️ బిబి న్యూస్ | 20 Jul 2026

అనకాపల్లి, జూలై 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందజేసే ప్రతిష్ఠాత్మక 'షైనింగ్ స్టార్' అవార్డు ఈ ఏడాది కశింకోటలోని వివేకానంద ఇంగ్లీషు మీడియం స్కూల్ విద్యార్థి పెంటకోట రిషీకేష్కు లభించింది.2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రిషీకేష్ 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించి విశిష్ట ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా సోమవారం అనకాపల్లిలోని పెంటకోట కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా రిషీకేష్‌కు షైనింగ్ స్టార్ అవార్డు అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థి పెంటకోట రిషీకేష్‌ను వివేకానంద ఇంగ్లీషు మీడియం స్కూల్ కరస్పాండెంట్ మళ్ల జగదీష్, ప్రిన్సిపాల్ మళ్ల శైలజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఘనంగా అభినందించారు.రిషీకేష్ సాధించిన ఈ ఘన విజయం పాఠశాలకు గర్వకారణమని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.