📢 Advertisement Space

అనకాపల్లి నుంచి అయోధ్య–కాశీ ఉచిత దివ్య దర్శన యాత్రకు శ్రీకారం

🗞️ బిబి న్యూస్ | 19 Jul 2026

తొలి విడతలో 1,600 మంది భక్తులతో ప్రత్యేక రైలును ప్రారంభించిన ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్

అనకాపల్లి, జూలై 19:
అనకాపల్లి పార్లమెంట్ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అయోధ్య–కాశీ ఉచిత దివ్య దర్శన యాత్ర హామీని కార్యరూపంలోకి తీసుకొస్తూ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్ ఆదివారం అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక రైలుకు జెండా ఊపి తొలి విడత ఉచిత ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సి.ఎం. రమేష్ సతీమణి శ్రీదేవి, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తొలి విడతలో 1,600 మంది భక్తులు అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక రైలులో బయలుదేరారు.రైలు బయలుదేరే ముందు ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్ ప్రతి కోచ్‌ను సందర్శించి యాత్రికులను ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ప్రయాణంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. అనంతరం ప్రత్యేక రైలులో యాత్రికులతో కలిసి ప్రయాణం ప్రారంభించి భక్తులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన అయోధ్య–కాశీ ఉచిత దర్శన హామీని నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూడా శ్రీరాముడు, కాశీ విశ్వనాథుని దర్శనం కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.యాత్రికులకు ప్రయాణం, భోజనం, వసతి, తాగునీరు, వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ప్రతి కోచ్‌కు ప్రత్యేక ఇన్‌చార్జిలు, వాలంటీర్లు, వైద్య బృందాలను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రతి అర్హ భక్తుడికి దశలవారీగా ఈ అవకాశాన్ని కల్పిస్తామని, రెండో విడత ప్రత్యేక రైలును సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల స్పందనను బట్టి భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక యాత్రలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.అనకాపల్లి అభివృద్ధిపై మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాకు రూ.5 లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. దేశ చరిత్రలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన పార్లమెంట్ నియోజకవర్గంగా అనకాపల్లి నిలుస్తోందని పేర్కొన్నారు. రైల్వే, రోడ్లు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కల్పనతో అనకాపల్లిని దేశంలోనే ఆదర్శ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ యాత్ర విజయవంతం కావడానికి సహకరించిన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్ బాబు, కె.ఎస్.ఎన్. రాజు, కార్పొరేషన్ చైర్మన్లు, రైల్వే అధికారులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.చివరగా అయోధ్య శ్రీరాముడు, కాశీ విశ్వనాథుని ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, యాత్రికులందరూ క్షేమంగా దర్శనం పూర్తి చేసుకుని ఆనందంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.