అంతర్ జిల్లాల ద్విచక్ర వాహన దొంగల ముఠా అరెస్ట్ – 17 బైక్‌లు స్వాధీనం
🗞️ బిబి న్యూస్ | 17 Jul 2026
కసింకోట: అంతర్ జిల్లాల పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను కసింకోట పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ముగ్గురు మేజర్లు, ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు ఒక ముఠాగా ఏర్పడి అనకాపల్లి, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితులందరూ తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రాంతానికి చెందినవారని తెలిపారు.నిందితుల వద్ద నుంచి మొత్తం 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.పట్టుబడిన ఇద్దరు మైనర్ నిందితులను జువెనైల్ హోంకు తరలించగా, మిగిలిన ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కసింకోట పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంచార్జ్ డీఎస్పీ డి.ఆర్.ఆర్. మోహన్ వెల్లడించారు.