అనకాపల్లి, జూలై 16: గవరపాలెంలోని శ్రీ జగన్నాథ స్వామి వారి పండుగ సందర్భంగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సమక్షంలో శ్రీ జగన్నాథ స్వామి వారి రథాన్ని లాగి రథయాత్రను ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ దాడి బుజ్జి, ఆలయ ఈఓ తేజ, 80, 83 టీడీపీ ఇన్‌చార్జ్‌లు బోడెడ జోగినాయుడు, బొడ్డపు ప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వెదుళ్ల సూర్యప్రభ, గవర కార్పొరేషన్ డైరెక్టర్లు విల్లూరి హరి, బోడెడ శ్రీను, భోగాలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ, వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, కూటమి పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని నాయకులు ఆకాంక్షించారు.