📢 Advertisement Space

ఉమ్మడి భూమిలో సరుగుడు చెట్ల నరికివేత..సీఐకు బాధితురాలి ఫిర్యాదు

🗞️ బిబి న్యూస్ | 16 Jul 2026

పరవాడ, జూలై 16: పరవాడ మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన పల్లి శివభారతి పరవాడ పోలీస్ స్టేషన్ సీఐకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి చెందిన ఉమ్మడి భూమిలో కొందరు బంధువులు అక్రమంగా సరుగుడు చెట్లను నరికివేస్తున్నారని ఆమె ఆరోపించారు.ఫిర్యాదు వివరాల ప్రకారం, నాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని హస్తినాపురం వద్ద సుమారు 15 ఎకరాల ఉమ్మడి భూమి ఉందని, ఆ భూమిలో గతంలో కుటుంబ సభ్యులు కలిసి సరుగుడు మొక్కలు నాటారని తెలిపారు. ఇప్పటివరకు ఆస్తి విభజన జరగలేదని, ప్రస్తుతం తమ తాత పల్లి సన్యాసినాయుడు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కొందరు బంధువులు ఉమ్మడి భూమిలోని సరుగుడు చెట్లను నరికివేస్తున్నారని ఆరోపించారు.తాము అడ్డుకునేందుకు వెళ్లగా తమను దుర్భాషలాడి, తోసివేసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఉమ్మడి ఆస్తిని రక్షించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పరవాడ సీఐను ఆమె కోరారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.