దాడి రత్నాకర్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
🗞️ బిబి న్యూస్ | 15 Jul 2026
అనకాపల్లి, జూలై 15: దాడి విద్యాసంస్థల అధినేత, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు శ్రీ దాడి రత్నాకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సర్వేజన ఐక్య వేదిక వ్యవస్థాపకులు కోరిబిల్లి పరి ఆధ్వర్యంలో అనకాపల్లి రింగ్ రోడ్డులోని సన్ క్యాస్టల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 29 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక సేవలో భాగస్వాములయ్యారు. అనంతరం రక్తదాతల చేతుల మీదుగా కేక్ కట్ చేసి దాడి రత్నాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే మహత్తర సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విల్లూరి రాజశేఖర్, వమ్ముల కాశీ, దొడ్డి రమణ, గిరిబాబు, సతీష్, కోటిపల్లి శ్రీను, నాగు, రాంబాబు, పరదేశి నాయుడు, బండి రాజా తదితరులు, అభిమానులు పాల్గొని దాడి రత్నాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.