వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నారాయణ (O.N.C.S) విద్యాసంస్థ
🗞️ బిబి న్యూస్ | 15 Jul 2026
అనకాపల్లి, జూలై 15: అనకాపల్లిలోని నారాయణ (O.N.C.S) విద్యాసంస్థలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ఏజీఎం శివరాం, ఆర్‌ఐ రవికుమార్, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ లిఖితతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం ప్రాముఖ్యతను వివరించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు.ర్యాలీలో భాగంగా విద్యార్థులు అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ సమీపంలోని జీవీఎంసీ (GVMC) కార్యాలయానికి వెళ్లి అక్కడి సూపరింటెండెంట్‌కు మొక్కలను బహూకరించారు. అనంతరం విద్యాసంస్థలో వనమహోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రలేఖన పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.అలాగే పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు.విద్యార్థుల ర్యాలీ విజయవంతంగా సాగేందుకు సహకరించిన పోలీసు, ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి నారాయణ (O.N.C.S) విద్యాసంస్థల యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.