సర్ వెరిఫికేషన్‌కు మరో 10 రోజుల గడువు పొడిగింపు
🗞️ బిబి న్యూస్ | 15 Jul 2026
అనకాపల్లి, జూలై 15: ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సర్ (SIR) వెరిఫికేషన్ ప్రక్రియకు మరో 10 రోజుల గడువు పొడిగించినట్లు భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు నియమితులైన బీఎల్-2లు (BL-2లు) తమ పరిధిలోని సర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి, సంబంధిత బీఎల్‌ఓలకు (BLOలు) వివరాలను అందజేశారని వెల్లడించారు.ఈ సందర్భంగా గవరపాలెం బీఎల్-2 దాడి వీరునాయుడు మాట్లాడుతూ, ఇప్పటివరకు సర్ వెరిఫికేషన్ చేయించుకోని అర్హులైన ఓటర్లు ఎవరైనా ఉంటే, గడువు ముగిసేలోపు తమ పరిధిలోని బీఎల్-2లు లేదా బీఎల్‌ఓలను సంప్రదించి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్ కుమార్,అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ ,అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు,రాష్ట్ర కమిటీ సభ్యులు కొణతాల రాజబాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, మార్గదర్శకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు , కొణతాల అప్పలరాజు, దాడి వీరునాయుడు,పొలిమేర మోహనరావు, పెంటకోట తులసి, కుసుమంచి ప్రసాద్,సూరిశెట్టి ఉదయ్ కుమార్, నక్కిన పావన్ శ్రీరామ్, బీశెట్టి హేమ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.