అమరావతి ఛాంపియన్షిప్-2026 పోస్టర్ ఆవిష్కరణ
🗞️ బిబి న్యూస్ | 13 Jul 2026
అనకాపల్లి, జూలై 13: నేషనల్ స్పోర్ట్స్ డే 2026-27 సందర్భంగా నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్షిప్-2026 పోస్టర్‌ను అనకాపల్లిలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 17 ఏళ్లలోపు, 23 ఏళ్లలోపు బాలురు, బాలికలు అధిక సంఖ్యలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు.ఈ ఛాంపియన్షిప్‌లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, యోగా తదితర 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీలు జూలై 15 నుంచి ఆగస్టు 29 వరకు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జరుగనున్నాయి.పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) వెబ్‌సైట్‌లో ఆధార్ కార్డు ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పూజారి శైలజ తెలిపారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బొత్తల తాతయ్య బాబు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, డీసీసీబీ చైర్మన్ కోట్ని బాలాజీ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.