రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు కాండ్రేగుల వెంకట రమణకు ఘన సన్మానం
🗞️ బిబి న్యూస్ | 12 Jul 2026
అనకాపల్లి, జూలై 12: గవరపాలెంలోని ఎస్‌డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ కార్యాలయంలో శనివారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులుగా నియమితులైన కాండ్రేగుల వెంకట రమణకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో, విల్లూరి సంతోష్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ, కాండ్రేగుల వెంకట రమణ సమాచార హక్కుల చట్టం (RTI) ఉద్యమంలో విశేష సేవలు అందించిన ఉద్యమకారుడని కొనియాడారు. ఇటీవల ఆయనకు లభించిన రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుల పదవి ఆయన ప్రజాసేవకు దక్కిన గుర్తింపని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలకు ఈ పదవి కూడా చిన్నదేనని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల అధ్యక్షుడు బొడ్డెడ అప్పారావు, కె.యం నాయుడు,సర్వేజన ఐక్యసమితి వ్యవస్థాపకుడు కోరిబిల్లి పరి, హాస్య కళాసమితి అధ్యక్షుడు విల్లూరి సంతోష్, దాడి ఈశ్వరరావు, ఐతా రాంబాబు, కాండ్రేగుల శ్రీరామ్ మిత్రమండలి సభ్యులు పాల్గొని కాండ్రేగుల వెంకట రమణను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.