BLA-2లు చురుకుగా పనిచేయాలి: ద్వారపురెడ్డి పరమేశ్వరరావు
🗞️ బిబి న్యూస్ | 12 Jul 2026
అనకాపల్లి, జూలై 12: అనకాపల్లి నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ BLA-2లు తమ పరిధిలోని BLO (Booth Level Officer)లతో నిరంతరం సమన్వయం కలిగి ఉండి, ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితా ధృవీకరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పిలుపునిచ్చారు.బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా పరిశీలన, ధృవీకరణ ప్రక్రియ ఎన్నికల వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా ప్రతి BLA-2 తమ పరిధిలోని BLOలకు పూర్తి సహకారం అందించాలని సూచించారు.ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో జరుగుతున్న ధృవీకరణ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఏవైనా సమస్యలు లేదా లోపాలు గమనించిన వెంటనే సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఓటరు జాబితా ఖచ్చితత్వం ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమని పేర్కొన్న ఆయన, ప్రతి BLA-2 బాధ్యతాయుతంగా వ్యవహరించి ధృవీకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.